సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సైబర్ నేరగాళ్లు దెబ్బకు ప్రజా ప్రతినిధులు మంత్రులు కుటుంబ సభ్యులు సైతం డబ్బు కోల్పోయి విలవిలా లాడుతున్నారు. ఏపీ మంత్రి నారాయణ పెద్ద అల్లుడు పునిత్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.1కోటి 96 లక్షలను సైబర్ నేరగాళ్లు లూటీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పునిత్ నిర్వహించే ఐవీ గ్రీన్ ఇన్‌ఫ్రా కంపెనీ అకౌంటెంట్‌కు వాట్సాప్ మెసేజ్ రావడంతో .. పునిత్ నుంచే ఆ మెసేజ్ వచ్చిందని భావించిన ఆ సంస్థ అకౌంటెంట్.. సైబర్ కేటు గాళ్లు సూచించిన బ్యాంక్ అకౌంట్‌కు నగదును బదిలీ చేశారు. దీనిపై నెల్లూరు రూరల్ పోలీసులు విచారణ చేపట్టి, వెంటనే పునిత్ అకౌంట్ నుంచి ఇంకా బాలన్స్ ఉన్న రూ.కోటి 40 లక్షలను సీజ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *