సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో నేడు, సోమవారం విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు.వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ – 208 చాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా చెప్పినట్లు గానే మెగా డీఎస్సీ దస్త్రం పైనే లోకేష్ తొలి సంతకం చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 16347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన ఫైలుపైనే సంబంధిత శాఖ మంత్రిగా లోకేష్ తొలిసంతకం చేశారు. మెగా డీఎస్సీ విధివిధానాలు రూపొందించి క్యాబినెట్ ముందుకు పంపించారు. తన మంత్రి కుర్చీకి ఎలాంటి ఆర్భాటాలు వద్దని కుర్చీకి చుట్టిన టవల్‌ని లోకేష్ తీసివేశారు. నారా లోకేష్ కు మంత్రులు నిమ్మల రామానాయుడు, రాంప్రసాద్ రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, తదితరులు అభినందనలు తెలిపారు.
