సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీకాకుళం జిల్లా అరసవళ్లిలో నేడు, శుక్రవారం నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుబడితో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారు. అరసవల్లి కి వచ్చి ఇక్కడ ఉత్తరాంద్ర ప్రజలను అవమానించి రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ అనుమతి ఇస్తే.. 3 రాజధానులలో విశాఖ రాజధాని కోసం తాను రాజీనామాకైనా సిద్ధమేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. తన రియల్ ఎస్టేట్ అమరావతి కోసం మా ప్రాంత ప్రజలకు ద్రోహం చేస్తున్నచంద్రబాబు పన్నాగాలు ఇక చూస్తూ ఉరుకోము ఇక ‘‘విశాఖ రాజధాని కోసం ఉద్యమం అవసరం. ఉత్తరాంధ్ర అభివృద్ధి వద్దు అంటే ఎలా అంగీకరిస్తాం. అరసవెల్లి వచ్చి అమరావతి రైతులు దేవుణ్ణి మొక్కుకుని వెళ్తే మాకు అభ్యంతరం లేదు. ఈ గడ్డ మీదికి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోం. దశాబ్దాల తర్వాత వచ్చిన అద్భుత అవకాశం ఇది. ఇక సిక్కోలు జిల్లా వాసులు విశాఖ రాజధాని కోసం గట్టిగా పోరాడవలసిందే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *