సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత సముద్ర ఆహార ఎగుమతుల సంఘం ప్రతినిధులు ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆక్వా పరిశ్రమను ఆదుకోవటానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు సానా సతీష్ బాబు, లావు శ్రీకృష్ణ దేవరాయలు, బీద మస్తాన్ రావులు కూడా హాజరై, సంఘ ప్రతినిధులతో కలిసి మంత్రి నారా లోకేష్ కు వినతిపత్రం అందజేశారు. అమెరికా ప్రభుత్వం ఇటీవల భారత సముద్ర ఆహార ఎగుమతులపై 25% టారిఫ్ విధించడంతో, ఎగుమతి రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని, ప్రస్తుతం అమెరికా భారతదేశానికి అతిపెద్ద మార్కెట్ కాగా, సంవత్సరానికి 8 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి వారు తెలిపారు. ఈ టారిఫ్ కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచే అత్యధికంగా ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నందున, ఈ రంగాన్ని రక్షించడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఆక్వా పరిశ్రమ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, సీఎం చంద్రబాబు దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్లి, తగిన పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో భారత సముద్ర ఆహార ఎగుమతిదారుల సంఘం అధ్యక్షులు పవన్ కుమార్, సిఇఒ డాక్టర్ రాఘవన్, జాతీయ కమిటీ సభ్యుడు గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *