సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోట్లాది రూపాయాల విలువచేసే ప్రభుత్వ భూమిని వైసీపీ పార్టీ కార్యాలయాని కి కేటాయించారని ఆరోపిస్తూ ..దానికి నిరసనగా రోడ్లపై కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనుమతి లేకుండా రోడ్లపై నిరసనలు ఏమిటంటూ.. . ఈ కార్యక్రమానికి పోలీసులు అడ్డుతగిలారు. టీడీపీ కార్యకర్తలు దూసుకొనివెళ్లే ప్రయత్నం చెయ్యడంతో దీంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మాజీ మంత్రిని అడ్డుకున్నారు. అయితే కొందరు టీడీపీ కార్యకర్తలు పోలీసులకు చెప్పులు చూపించడం జరిగింది. అక్కడ జరిగిన టీడీపీ నేతలకు పోలీసులకు జరిగిన త్రోపులాటలో.. కొల్లు రవీంద్ర ఒక పోలీస్ అధికారిపై దాడికి దిగారని పిర్యాదు చెయ్యడంతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను మరియు బల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. కొల్లు రవీంద్రను కూడా అరెస్టు చేసి గూడూరువైపు తరలించారు. ఈ ఘటనతో మచిలీపట్నం లక్ష్మీటకీస్ సెంటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొంది .
