సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య గొడవల వల్ల జరుగుతున్న హింసకు, అక్కడ యువతుల పట్ల జరుగుతున్నా అనాగరిక ఘటనలకు నిరసనగా భీమవరం పట్టణంలో ఏపీ బహుజన జెఏసి, ముస్లిమ్స్ జెఏసి మరియు ఐద్వా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నేడు, బుధవారం కుల మతాలకు అతీతంగా పలువురు సభ్యులు పాల్గొని పట్టణ వీధుల గుండా వర్షం పడుతున్నప్పటికీ,ప్రధాన రహదారుల గుండా నిరసన ర్యాలీ చేపట్టి తదుపరి ఒకరి చేతిని మరొకరు పట్టుకొని సంఘీభావంతో భారత దేశ ఆకారంలో మానవహారం ను ఏర్పాటు చేసారు. వక్తలు మాట్లాడుతూ.. మణిపూర్ లో జరుగుతున్నా అరాచకాలు ఆగిపోవాలని అక్కడ ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిపై , అమ్మాయిలపై ఉన్మాదం చేస్తున్నవారిఫై కఠిన చర్యలు తీసుకోవాలని , పరిస్థితి అదుపులోకి రావాలని మానవత్వం మేలుకొని శాంతి రావాలని ఆకాంక్షించారు.
