సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: భారత దేశ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఆం దోళనలతో అట్టుడుకుతోంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలతో ఇటీవల రగిలిపోతుంది. పలు చోట్ల నిరసనకారుల్ని అదుపు చేయడానికి కాల్పులు జరపాల్సి న పరిస్థితి వచ్చిం దని పోలీసులు తెలిపారు. పలు గృహాలు, వాహనాలు దహనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ మారణహోమం లో మరణించిన వారి సంఖ్య 54కు చేరినట్లు తాజాగా నేడు, శనివారం అధికారులు ప్రకటించారు. అనధికారికంగా మృతుల సంఖ్యా మరింత ఎక్కువ మంది ఉంటారని, ఇప్పటికే పలు ఆసుపత్రులలో బుల్లెట్ గాయాలతో పలువురు చికిత్స పొందుతున్నారని తెలుస్తుంది. కాగా రాష్ట్రం లో పరిస్థితిని అదుపులోకి తెచ్చి , సాధారణ పరిస్థితిని నెలకొల్పడం కోసం కేంద్రం అదనపు బలగాలను రంగంలోకి దింపింది. కేంద్రం ఆర్టికల్ 355ను సైతం అమల్లోకి తీసుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *