సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 1987లో కమల్‌హాసన్‌ – మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ‘నాయకన్‌’ దేశవ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ప్రపంచ అత్యుత్తమ టేకింగ్ సినిమాలలో నాయకుడు కు ఒక స్తానం ఉంది. మళ్లీ 38 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి ప్రారంభించిన ‘థగ్‌లైఫ్‌’ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తీ చేసారు. ఇటీవల జరిగీన ఎఫ్‌సీసీఐ ఈవెంట్‌లో పాల్గొన్న కమలహాసన్ రాబోయే గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘థగ్‌లైఫ్‌’ ఓ మల్టీస్టారర్‌. ఇందులో చేస్తున్న నటీనటులు భవిష్యత్‌లో గొప్ప స్టార్స్‌ అవుతారు. అలాంటివాళ్లను ఈ మూవీలో భాగం చేయడం వల్లే ఇది మల్టీస్టారర్‌ అయింది.దేశంలోని అన్ని భాషలలోని అగ్ర నటులు, యువ నటులు కలయికగా సినిమా తీయాలన్నది మణిరత్నం ఆలోచన. ఇక ఇందులో మలయాళం, హిందీ, తెలుగు సినిమాల్లోని విలక్షణ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. శింబు, త్రిష, నాజర్‌, అభిరామి, జోజూజార్జ్‌, అశోక్‌ సెల్వన్‌, ఐశ్వర్య లక్ష్మి, మహేశ్‌ మంజ్రేకర్‌, అలీ ఫజల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవి కానుకగా జూన్‌ 5న మూవీ విడుదల కు సిద్ధం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *