సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై తమిళ సీనియర్ హీరో, తెలుగునాట సీనియర్ నటుడు కట్టప్ప గా ప్రసిద్ధి పొందిన సత్యరాజ్ ద్వ‌జ‌మెత్తాడు. ఇటీవ‌ల త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌నకు వెళ్లిన ప‌వన్ మదురైలో నిర్వహించిన మురుగ‌న్ భ‌క్తుల‌ సమావేశంలో మాట్లాడుతూ.. తనకు తమినాడు తో ఎంతో అనుబంధం ఉందని, ఇక్కడివాడినేనని, తమిళనాడులో సనాతన హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేసే (అధికార డీఎంకే పార్టీపై పరోక్షంగా ) నాస్తికులకు ఏ దేవుడినీ నమ్మాల్సిన అవసరం లేదని.. కానీ మన దేశంలో నాస్తికులు హిందువుల‌ను ఎంపిక చేసుకుని టార్గెట్ చేస్తున్నారు అంటూ వీరి విషయంలో హిందువులు మురుగన్ భక్తులు ఆలోచించాలని పవన్ కామెంట్స్ చేశారు. దీనిపై స్థానిక డీఎంకే పార్టీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.ఇంతలో ముఖ్యంగా దేవుడి పేరుతో తమిళనాడులో పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తే ఊరుకోమంటూ తాజాగా సత్యరాజ్ (Sathyaraj) హెచ్చరించారు. ఒక స‌భ‌లో సత్యరాజ్ మాట్లాడుతూ.. మ‌తం పేరుతో తమిళనాడు లో ఓట్లు దండుకోవాల‌ని చూస్తే ఇక్క‌డ కుద‌ర‌ద‌న్నారు. పెరియార్ సిద్ధాంతాలను నమ్మే మమ్మ‌ల్ని ఎవరూ మోసం చేయలేర‌ని, మీరు పాల్గొన్న‌ స‌భ‌తో మ‌మ్మ‌ల్ని మోసం చేశారు అనుకుంటే అది మీ తెలివి త‌క్కువ త‌నమే అని, తమిళ ప్ర‌జ‌లు తెలివైనవార‌ని ఇక్క‌డ‌ మీ ఆటలు అస‌లు సాగవంటూ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి సత్యరాజ్ విమ‌ర్శించారు. ఇదిలా ఉంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాబోవు చిత్రం హారిహార వీర‌మ‌ల్లు చిత్రంలో స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌ పోషిస్తుండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *