సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు ఉపాధి నిమిత్తం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రూ.93.62కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,326 నీటి చెరువులలో 84.62 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరో వారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, అక్టోబరులోగా ఉచిత చేప పిల్లల పంపిణీ, చెరువుల్లో పోసే కార్యక్రమం చేపట్టేందుకు మత్స్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు టెండర్ల నోటిఫికేషన్‌ ఈ నెల 18నే జారీ కాగా, 20వ తేదీ ఉదయం నుంచీ టెండరు బిడ్ల స్వీకరణ ప్రారంభమైంది. సెప్టెంబరు ఒకటో తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ బిడ్లు స్వీకరిస్తారు.అదేరోజు మూడున్నర గంటలకు టెండర్‌ బిడ్లు తెరుస్తారు. ఈ మేరకు జిల్లాల వారీగా బిడ్‌ డాక్యుమెంట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ టి. శ్రీనివాస్‌ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మత్యకారులకు భీమవరం కలెక్టర్ కార్యాలయం, ఎంపెడా కార్యాలయంలలో మరిన్ని వివరాలు తెలుస్తాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *