సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం అసెంబ్లీలో .. రాష్ట్రంలో మత్స్య కార్మికులకు ఇబ్బందిగా ఉన్న 217 జీవోను రద్దు చేస్తామని వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవోయే నెం.217. రాష్ట్ర వ్యాప్తంగా 2800 సొసైటీల పొట్టకొట్టే, లక్షలాది మంది మత్స్యకారులు రోడ్డున పడేలా అప్పట్లో జగన్ ప్రభుత్వం 217 జీవోను రూపొందించిందని, గతంలో ప్రతిపక్షనేత గా ఉన్న సమయంలో చంద్రబాబు ఈ జీవోను రద్దు చేస్తాననిహామీ ఇచ్చారని .. మరి దానిని రద్దు చేస్తున్నామని అన్నారు. . కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాది వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అచ్చెన్న మాట్లాడుతూ.. త్వరలో కేబినెట్‌లో పెట్టి ఈ జీవోను రద్దు చేస్తామన్నారు.
