సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని పెనుమంట్ర మండలం పోలమూరులో జరిగిన మోటారు బైకు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. గత అర్ధరాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొని తీవ్రంగా మద్యం మత్తులో ముగ్గురు ఒకే బైక్ ఫై అతివేగంతో వస్తు అదుపు తప్పి రహదారి ప్రక్కన ఒక గోడను ఢీకొట్టారు. తీవ్రగాయాల పాలైన వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా అతను కూడా మృ తిచెందినట్లు వైద్యు లు నిర్ధరించారు. మృతులను ఏలేటిరాజు (19), ఏలేటి అంజి (25), కోళ్ల సత్య నారాయణ (20)గా గుర్తించారు. వీరిలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఏలేటి అంజి కి భార్య ఒక పాప ఉండగా, భార్య మరోసారి గర్భిణీ గా ఉండటం తీవ్ర విషాదం నింపింది.
