సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు నేడు, మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన రచ్చబండ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మధ్య నిషేధం అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు 40 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ ప్రభుత్వం లూటీ చేస్తోందని ఆరోపణ చేసారు. ఈ మూడేళ్లలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ( డి బి టీ ) విధానం ద్వారా 1.20 నుంచి 1.30 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు అందజేశామని చెబుతున్న ప్రభుత్వం, ఈ మూడున్నర ఇళ్లలో 1.35 లక్షల కోట్ల రూపాయలను మద్యం ద్వారా అర్జించిందన్నారు. మధ్య నిషేధం పేరిట ప్రజలను నమ్మించి మద్యం రూపంలోనే లక్షల కోట్ల రూపాయలను ఈ మూడున్నర ఏళ్ళ వ్యవధిలో లాగేసుకోవడం న్యాయమా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై ఐపీసీ 153 a సెక్షన్ కింద కేసులు నమోదు చేసి, ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని, జాతుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికిచూస్తున్నారన్న నెపముతో కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఇది చాల అనైతికమని విమర్శిచారు.
