సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని మోడీ యూరప్ లో గత 4 రోజులు పర్యటన ముగిసింది. భారత కాలమాన ప్రకారం గత రాత్రి అమెరికాలోని వైట్ హౌస్‌లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ భేటి అయ్యారు. యూఎస్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు విదేశాంగమంత్రి జైశంకర్‌, NSA అజిత్‌ దోవల్‌ పాల్గొన్నారు. వలసలు, వాణిజ్యం, సుంకాలే ప్రధాన అజెండాగా ఇరు దేశాల నేతలు చర్చించారు. ఈ సందర్భంగా అమెరికా-భారత్‌ కలిసి ఉండటం చాలా ముఖ్యమన్నారు ట్రంప్‌. మరోవైపు అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ వైఖరిని బలపరుస్తూ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. అమెరికాలో భారత పౌరులు అక్రమంగా ఎవరున్నా వెనక్కి తీసుకుంటామన్నారు. ప్రధాని మోదీతో జరిగిన మీటింగ్‌లోనే సుంకాలపై ట్రంప్‌ వైఖరి మారలేదు. భారత్‌తో వాణిజ్యం చాలా కష్టంగా మారింది. తమ వస్తువులపై భారత్‌ భారీగా సుంకాలు విధిస్తోందని.. తాము కూడా సుంకాలు విధిస్తామన్నారు. అలాగే భారత్‌కు క్రిమినల్స్‌ను అప్పగిస్తామన్నారు డొనాల్డ్ ట్రంప్‌. నవంబర్‌ 28 ఉగ్రదాడి సూత్రధారిని అప్పగిస్తున్నాం. నా ఫ్రెండ్‌ మోదీని కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. అటు భారత్‌తో స్నేహబంధం కొనసాగుతుందని, కలిసి ముందుకెళ్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *