సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీ అంటు వివాదాల నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, హీరో కార్తీని క్షమాపణలు చెప్పించి, ప్రకాష్ రాజ్ ను హెచ్చరించిన నేపథ్యంలో అప్పటి నుండి నటుడు ప్రకాష్ రాజు తనదయిన విమర్శలతో పవన్ ను టార్గెట్ గా? పరోక్షముగా దెప్పిపొడుస్తూ ప్రతి రోజు ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఆయన పోస్టుల పరంపర కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా కొత్త పోస్ట్ పెట్టారు.దానిలో.. ‘‘మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చ గొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబం ధమైన, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్య ను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్’’ అని పేర్కొన్నారు. ఈ వరుస పోస్టులపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన అసహనాన్ని వ్యక్తం చేసారు. ప్రకాష్ రాజు అంటే నాకు గౌరవం ఉంది. అయితే ఆయన సున్ని అంశలపై ప్రకాష్ రాజు తెలుసుకొని మాట్లాడితే మంచిది.. అని అన్నారు.
