సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు అన్ని అవరోధాలు అధిగమించి నేడు, మంగళవారం భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటిష్ ప్రధాని గా పదవి బాధ్యతలు స్వీకరించి తొలి ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం బ్రిటన్ కష్టకాలంలో ఉందని అయితే అతి త్వరలోనే అభివృద్ధి పథంలోకి అందరికి సహకారంతో తీసుకొనే వెళ్లే దిశగా అడుగులు వేస్తానన్నారు. అందుకు రానున్న రోజుల్లో కఠిన నిర్ణయాలకు బ్రిటన్ ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అప్పుల సమస్య పరిష్కారాన్ని భవిషత్తు తరాలకు వదిలేయబోనన్నారు. గత ప్రధాని లిజ్ ట్రస్ ( ఎన్నికయిన 45 రోజులకే రాజీనామా చేశారు)ద్వారా జరిగిన తప్పిదాలను సరిచేయడానికే తాను ప్రధాని అయినట్లు రిషి సునాక్ చెప్పారు. ఒక ఇండియన్ రెస్టారెంట్ కు వెయిటర్ నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన రిషి సునాక్ బ్రిటన్ చరిత్రలోనే ప్రధాని బాధ్యతలు స్వీకరించిన 42 సంవత్సరాల అత్యంత పిన్న వయస్కుడు. మన భారతీయులకు స్వయాన అల్లుడు కూడా 2009లో రిషి సునాక్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని వివాహమాడారు. హిందూ సంప్రదాయాలు పాటించే వీరికి ఇద్దరు సంతానం. కృష్ణా సునాక్, అనౌష్కా సునాక్.
