సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో నేడు, ఆదివారం ‘మన వారి కోసం మనం’ పేరుతో కాపు సామాజిక వర్గ ప్రముఖులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి భూపతిరావు శ్రీనివాస వర్మ పాల్గొని మాట్లాడారు. తనకు భీమవరంలోని కాపు సామాజిక వర్గంలో ఎందరో సన్నిహితులు ఉన్నారని, తాను కే జి ఆర్ ఎల్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లలో జాయింట్ సెక్రటరీగా పోటీ చేశానని, క్షత్రియ సామాజిక వర్గం నుండి తాను ఒక్కడినే విద్యార్థిని అయినప్పటికీ కాపు సామాజిక వర్గం విద్యార్థుల సహకారంతో విజయం సాధించానని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి పేరిట ఏర్పాటు చేస్తున్న ట్రస్టు ద్వారా అవసరమైన వెనుకబడిన కాపు సామాజిక వర్గ విద్యార్థులకు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు,మన వారి కోసం మనం అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్,చినిమిల్లి వెంకట రాయుడు, ఉపాధ్యక్షులు అడపా బాబ్జి, కార్యదర్శి ఆరేటి ప్రకాష్, కోశాధికారి వడుపు గోపి,తోట భోగయ్య, ఛాంబర్ అధ్యక్షులు పులఖoడం కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చుండూరి మల్లీశ్వరి, డాక్టర్ చుoడూరి సాయిబాబు, డాక్టర్ ఇర్రింకి నరేష్, డాక్టర్ మేళం రంగారావు, కాగిత వెంకటరమణ, ,ఎస్.కృష్ణమోహన్,నందమూరి రాజేష్, లతో పాటు పలువురు కాపు ప్రముఖులు పాల్గొన్నారు.
