సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని మెగా స్టార్ చిరంజీవి , విక్టరీ వెంకటేష్ హీరోలుగా నటించిన మన శంకర్ వర ప్రసాద్ వంటి చిత్రానికి మాటల రచయిత మన భీమవరం వాసి..మారోజు నాగ కావడం మనందరికీ గర్వకారణమని,చిత్రం గొప్ప విజయం సాధించిందని శత సినిమాల నిర్మాత ‘భీమవరం టాకీస్’ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ అన్నారు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ అధ్వర్యంలో నేడు మంగళవారం తాడిమళ్ళ వారి వేదికపై మాటల రచయిత మారోజు నాగ ను సత్కరించారు. రానున్న రోజుల్లో మరెన్నో చిత్రాల్లో మాటల రచయిత మరింత రాణించాలన్నారు. క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు ,కారుమూరి సత్యనారాయణ మూర్తి, కో. కన్వీనర్ వోలేటి శ్రీనివాస్, పి. ర్. ఓ. భట్టిప్రోలు శ్రీనివాసరావు, కోట్ల నాని, జూలూరి రాజా, కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ కళలను కళాకారులను ప్రోత్సహించేది సినీ పరిశ్రమ అని, భీమవరం ఎంతో మంది కళాకారులు సినీ పరిశ్రమల్లో మంచి స్థానాన్ని సాధించుకున్నారని అన్నారు.
