సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భముగా తెలుగు రాష్ట్రాలలో అభిమానులు సందడి అంతాఇంతా కాదు. దానికి తోడు చిరంజీవి నటించిన విశ్వంభర టీజర్ మరియు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వర ప్రసాద్ గారు” పండుగకు వస్తున్నాము.. టాగ్ తో టైటిల్ ప్రకటన అభిమానులలో మరింత జోష్ నింపింది. ఈ సందర్భముగా అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ.. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఈ రోజు చిరంజీవి గారినే డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందని అనుకోలేదు. వింటేజ్ మెగాస్టార్ ను ఇందులో చూపించబోతున్నట్టు తెలిపాడు. చిరంజీవి ఎంతో కష్టపడి తన లుక్స్ ను మార్చుకున్నాడని.. ఆయన మొదటి షాట్ ను మానిటర్ లో చూసినప్పుడు చాలాఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. అలాగే ఇందులో చిరంజీవి, ప్రత్యేక పాత్రలో వెంకటేశ్ గారిని మల్టి స్టార్ గా చూపించే అవకాశం కూడా కలిగింది అన్నారు. అన్ని కుదిరితే చిరంజీవి, బాలకృష్ణ కాంబో సినిమా కూడా చేస్తానని .. వారిద్దరూ సిద్ధమేనని.. కానీ సరైన కథ దొరకాలి కదా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *