సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నయనతార నటించిన మన శంకర వర ప్రసాద్ సినిమా గత రాత్రి 9 గంటలకు భీమవరంలో 7 థియేటర్స్ లో ప్రీమియర్ షో లతో విడుదలయింది. రాత్రి నుండి మెగా అభిమానుల సంబరాలు జోష్ అందుకొన్నాయి. అయితే సినిమా టాక్ కూడా గుడ్ టాక్ సాధించింది. మెగాస్టార్ చిరు మరోసారి నైంటీస్ లుక్ లో మంచి కామిడీ ని పండించారని , చివరి అర్ధగంటలో వెంకీ హుషారుగా చిరుతో కలసి మంచి సందడి చేసారని , వెంకీ చిరు పాత పాటల పేరడీ అదిరిపోయిందని ఇదే నిజమైన సంక్రాంతి సినిమా అని టాక్ సాధించింది. దర్శకుడు అనిల్ రావిపూడి వరుసగా 9వ విజయం సాధించారని , ‘లక్కీ’ వెంకీ తో వరుసగా 4వ విజయం మెగా స్టార్ తో మొదటి సినిమా అదరగొట్టారని ఇండస్ట్రీ టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *