సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఉదయం టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం ప్రజాప్రతినిధుల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. . ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన పనులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఏ నమ్మకంతో ప్రజలు మనకు ఓటేశారో ఆ నమ్మకాన్ని అంతా నిలబెట్టుకోవాలని సూచించారు. ఐదేళ్లు తీవ్రంగా నష్టపోయి, కష్టనష్టాలు ఎదుర్కొన్న మన టీడీపీ కార్యకర్తల బాధను సమన్వయం చేసుకోవాలన్నారు. మన ప్రభుత్వంలో ఇసుక, మద్యం విధానాల్లో వైసీపీ చేసిన తప్పే పార్టీ నాయకులూ చేస్తానంటే ఊరుకోనని హెచ్చరించారు. ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి వస్తే పార్టీకి, నేతలకూ ఇబ్బందే అని అన్నారు. ఇసుక, మద్యం అంశాల్లో ప్రతీ ఒక్కరికీ క్రమశిక్షణ అవసరమని స్పష్టం చేశారు. మద్యంలో వైసీపీ నేతలు దోచిన డబ్బు బస్తాలు బస్తాలుగా వారి దగ్గర ఉందన్నారు గ్రామాల్లో, పట్టణాల్లో టన్నుల కొద్దీ వైసీపీ చెత్తపేర్చినా మన నేతలెవ్వరూమాట్లాడట్లేదు. ఎన్నికల్లో సూపర్ 6 పథకాలు మాదిరి ప్రభుత్వం సూపర్ 6 పాలసీలు తీసుకొచ్చింది. మన ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ 6 పాలసీలు గేమ్ ఛేంజర్ కానున్నాయి’’ అని అన్నారు. ‘2029లో మళ్లీ గెలవాలంటే ఎన్డీఏ ను అనుసంధానం చేసుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యేలను భాగస్వాముల్ని చేస్తా. రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులతో పాటు కేంద్రం చేసే పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మూడు పార్టీలు సమన్వయం చేసుకోవాలి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేని 41 నియోజకవర్గాల్లో టీడీపీని కాపాడుకోవటంతో పాటు మిత్రపక్ష ఎమ్మెల్యేలకు అండగా నిలవాలి. లేకపోతె మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. మనకు వచ్చే ప్రతీ విన్నతి సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదో వివరణ ఇవ్వాలి, సాధ్యమయ్యే ప్రతీ వినతి పరిష్కరించాలి’’ అని సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
