సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వరుస నష్టాల నుంచి కోలుకుని గత గురువారం లాభాలు లో దూసుకొనివెళ్ళిన దేశీయ సూచీలు నేడు, శుక్రవారం కూడా లాభాల బాటలోనే సాగుతున్నాయి. లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరే పరిస్థితులు కనిపిస్తుండడం, అమెరికా బృందం ను పంపుతున్నట్లు ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడడం తో ఎదో మంచిజరగనుంది అని ఆశలతో సెన్సెక్స్, నిఫ్టీ లు పుంజుకున్నాయి (Indian stock).గత సెషన్ ముగింపు (84, 818)తో పోల్చుకుంటే నేడు, శుక్రవారం ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఒక దశలో 400 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 257 పాయింట్ల లాభంతో 85, 075 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 96 పాయింట్ల లాభంతో 25, 995 వద్ద కొనసాగుతోంది (stock market ).బ్యాంక్ నిఫ్టీ 227 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 405 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. . డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ మాత్రం ఏకంగా 90.39గా పడిపోయింది.
