సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అడ్డు అదుపు లేకుండా ఫై పైకి దూసుకెళ్తున్న బంగారం ధరలు గత వారంరోజులుగా తగ్గుతూ వచ్చాయి. దీంతో బంగారం కొనుగోలుదారులు కాస్త ఆనందపడుతున్న వేళా మరోసారి.. మళ్లీ బంగారం ధరల పెరుగుదల మొదలయింది. ఈనెల 26న (శుక్రవారం) 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 440 పెరిగింది. తాజాగా నేడు, శనివారంకూడా బంగారం ధర పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్లపై రూ. 220 పెరిగింది. దీంతో రెండు రోజుల్లోనే గోల్డ్ రేటు రూ.660 పెరిగినట్లయింది. మరోవైపు వెండి ధర కాస్త తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గింది. దీంతో పది రోజుల్లో కిలో వెండిపై రూ. 2500 తగ్గింది.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. నేడు, శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,930 వద్దకు చేరటం గమనార్హం. .
