సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొన్న గురువారం సాయంత్రం ముగింపులో ఊహించని విధంగా నష్టాల వైపు దూసుకొనిపోయిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు, శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్ ను యుద్దమ్ చెయ్యకుండానే ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టి ఆర్ధికంగా భారీ దెబ్బ కొట్టిన నేపథ్యంలో భారత్ పాక్ యుద్ధం వెనక్కి వెళుతున్న సూచనలు మరియు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ సూచీలు రాణిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ (Sensex) 424 పాయింట్ల లాభంతో 80,666 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 88 పాయింట్ల లాభంతో 24,422 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
