సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్లు అర్జున్ వ్యవహారం ఫై తెలంగాణాలో ఒక రకంగా.. ఏపీలో మరో రకంగా రాజకీయ పార్టీలు స్వాందిస్తున్నాయి. బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లతో పాటు ఎంపీలు రఘునందన్, డీకే అరుణ , ఏపీలో మాజీ సీఎం వై యస్ జగన్ అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండిస్తూ బహిరంగ మద్దతు ప్రకటిస్తుండగా ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు రాజు, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తూ అల్లు అర్జున్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చెయ్యడం గమనార్హం. తెలంగాణాలో కాంగ్రెస్ కు మజ్లీస్ బహిరంగ మద్దత్తు తెలుపుతుంది.ఇదే అదనుగా అల్లు అర్జున్ ఇంటిపై ఓ యు విద్యార్థులు కొందరు రాళ్లతో దాడి కూడా చేసారు. మరోవైపు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనపై అల్లు అర్జున్.. పోలీసుల విచారణను ఎదుర్కుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో నేడు, మంగళవారం ఉదయం చిక్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు అల్లు అర్జున్ తన లాయర్లు తో వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌ను పోలీసులు పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. గంటకు పైగా విచారణ చేసారు. అల్లు అర్జున్ ఇస్తున్న స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. కేసు విచారణను ప్రభావితం చేయవద్దని అల్లు అర్జున్‌కు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సంధ్యా థియేటర్ ఘటనపై మజ్లీస్ నేతలతో పాటు సీఎం రేవంత్ అసెంబ్లీలో అల్లు కాలు విరిగిందా ? కన్ను పోయిందా? అంటూ మాట్లాడడటం మాట్లాడిన మరుసటి రోజే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పడంతో విచారణను ప్రభావితం చేస్తున్నట్లే అని పోలీసులు చెబుతున్నారు. దేశం అంతా ఈ కేసు విచారణ ను రాజకీయ నేతల ట్విస్ట్ లను గమనిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *