సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు డిసెంబర్ నెల ఒకటో తేదీ కావడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎప్పటిలానే ఈసారి కూడా వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేశాయి. ఈసారి వాణిజ్య సిలిండర్ ధరను పెంచేశాయి. ధరల పెంపు నేటి నుంచే అమలులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ ధర రూ.21 పెరిగింది. అయితే, సాధారణ గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇక ఇవాళ పెరిగిన రూ.21తో కలుపుకుని ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (19 కిలోలు) ధర రూ.1,797.50కి చేరింది. కాగా, ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (14.2కిలోలు) ధర రూ.903గా ఉంది. మిగతా రాష్ట్రాలలో కూడా ఈ ధరలకు స్థానిక టాక్స్ లు కలుపుకొని కాస్త అటుఇటుగా ధరలు ఉంటాయి.
