సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో టమాటా ధరలు ఎప్పుడు నిలకడగా ఉండవు. అయితే కేజీ 2 లేకపోతె 100 రూపాయలు వరకు పెరిగిపోతూ స్థిరం లేకుండా ఉంటాయి. కార్తీకమాసం ముగిసిన తరువాత ఇంకా తగ్గవాల్సిన కూరగాయల ధరలు ఈసారి మరింత పెరుగుతూ పోతున్నాయి. వారిలో కీలకమైన టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. మదనపల్లి హోల్ సేల్ మార్కెట్ లో సైతం నేడు, బుధవారం కిలో టమాటా ధర రూ.63కి చేరడంతో కొనుగోలుదారులు నోరెళ్లబెడుతున్నారు. 2వారాల క్రితం వరకు కేవలం 20 రూపాయలకు కిలో పలికిన టమాటా ధరలు. రిటైల్ గా ఒకేసారి 70-75 రూపాయల వరకు ధర పలకడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా సాగు చేస్తున్న రైతులు ధర ఉన్నా ప్రస్తుతం దిగుబడి లేక దిగులు చెందుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దిగుబడి తగ్గింది. వర్షాల వల్ల చీడ పీడల బెడద రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో మదనపల్లి మార్కెట్‌కు టమాటాలు రావడం 70శాతం తగ్గింది ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *