సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం తీవ్ర నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు నేటి సోమవారం ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. లెబనాన్,ఇరాన్ లతో ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం గత రెండు వారాలు దేశీయ సూచీలను పడదోస్తుంది. అయితే ఇజ్రాయిల్ ఇంకా ఇరాక్ ఫై దాడికి దిగకపోవడంతో అయితే రాబోయే కాలంలో సూచీలు స్థిరంగా కొనసాగతాయని అంచనాలుతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. గత శుక్రవారం ముగింపు (81, 381)తో పోల్చుకుంటే నేడు, సోమవారం దాదాపు 200 పాయింట్ల లాభంతో 81, 576 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింతగా లాభాల్లోకి దూసుకొచ్చింది. ఉదయం 11 గంటలకు 81, 930 వద్ద గరిష్టానికి చేరుకుంది.470 పాయింట్లకు పైగా లాభపడి 81, 830 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. దాదాపు 50 పాయింట్లకు పైగా లాభంతో రోజును ప్రారంభించి ప్రస్తుతం 25, 100 వద్ద కొనసాగుతోంది. మళ్లీ 25 వేల మార్క్‌ను దాటింది.సెన్సెక్స్‌లో ఒబెరాయ్ రియాల్టీ, నేషనల్ అల్యూమినియం, విప్రో, ఫెడరల్ బ్యాంక్ షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *