సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కొద్దీ రోజులుగా తీవ్ర ఒడిదొడుకులు లోనవుతున్న స్టాక్ మార్కెట్ .. నేడు, సోమవారం మాత్రం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. విపరీతమైన కొనుగోళ్లు నమోదు కావడంతో మార్కెట్‌లోని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. మరోవైపు మార్కెట్‌కు మంచి గ్లోబల్ సంకేతాలు తోడవడంతో హెవీవెయిట్ స్టాక్‌లలో బలమైన కొనుగోళ్లకు మద్దతు లభించింది. దీంతో సెన్సెక్స్ 1241 పాయింట్లు జంప్ చేసి 71,941కి చేరుకుంది. మరోవైపు నిఫ్టీ కూడా 385 పాయింట్లు పెరిగి 21,737 వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు సైతం 576, 770 పాయింట్లు వృద్ధి చెందాయి.ఈ క్రమంలో బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్షియల్, మెటల్ రంగాల్లో మార్కెట్‌లో గరిష్ఠ కొనుగోళ్లు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *