సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : భీమవరంలో నేడు, అదివారం స్థానిక జనసేన పార్టీ ఆఫీస్ నందు జిల్లా అధ్యక్షులు & నియోజవర్గం ఇంఛార్జి గోవిందరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జనసేనాని పవన్ కళ్యాణ్ చేప్పట్టిన మొదటి విడుత వారాహి యాత్ర భీమవరంతో జయప్రదం అయ్యిందని సహకరించిన అందరికి మీడియాకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. భీమవరంలో పవన్ సభ కు భారీ గా జనం తరలి రావడం తో వైసిపి వర్గాలకు గాలి తీసేసినట్లయిందని.. జనసేన ప్రభంజనం చూసి మాటలు రాక ..తుస్.. తుస్ అని గాలి వస్తుందని ఎద్దేవా చేసారు. భీమవరంలో వారాహి ఫై పవన్ కళ్యాణ్ ఎక్కడ స్థానిక ఎమెల్యే గ్రంధి శ్రీనివాస్ పేరు ప్రస్తావించకపోవడంతో ఆయన బాగా నిరాశ చెంది ఉంటారని.. జనసేన పాదయాత్ర చెయ్యబట్టే భీమవరంలో తాడేరు వంతెన ఇప్పుడు వేగంగా పూర్తీ చేస్తున్నారని ఇది బాధ్యత తో నిర్మిస్తున్నది కాదని కేవలం జనసేన ప్రశ్నిస్తుంది అన్న భయం వల్ల నిర్మిస్తున్నారని గోవిందరావు అన్నారు. ఈసారి ఎన్నికలలో భీమవరంలో జనసేన జెండా ఎగిరి తీరుతుందని ధీమా వ్యక్తం చేసారు. త్వరలో ప్రజా సమస్యలపై మరో పాదయాత్ర చేపడతామని అన్నారు. భీమవరంలో జ్వరం వల్ల జనసేన నేతలను కలవలేకపోయిన పవన్ కళ్యాణ్ మరి కొద్దీ రోజులలో భీమవరం వస్తారని, కొన్ని రోజులు ఇక్కడే ఉంటారని అప్పుడు భీమవరం , ఉండి నియోజకవర్గాల జనసేన నేతలతో సమీక్షలు చేస్తారని, వారాహి 2విడుత యాత్ర ఫై షెడ్యూలు వస్తుందని.. ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నేతలు పాల్గొన్నారు.
