సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో భారీ నష్టాల నుంచి కోలుకుని గత మంగళవారం లాభాలను ఆర్జించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు, బుధవారం మళ్లీ నష్టాల లోకి వెళ్లాయి..గత సెషన్ ముగింపు (78,205)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత భారీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. మళ్లీ 77 వేల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 502 పాయింట్ల నష్టంతో 77,745 వద్ద కొనసాగుతోంది. తదుపరి సూచీలు పడిపోతూ సాయంత్రానికి భారీ నష్టాలతో 1342 పాయింట్స్ నష్టపోయి చివరకు 76,863 వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే 394 పాయింట్ల నష్టంతో 23,866,వద్ద ముగిసింది.
