సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మొన్నటి వరకు రష్యా వద్ద భారత్ చమురు కొనుగోళ్లు చెయ్యకూడదని చెప్పి భారీ సుంకాలతో అమెరికా తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. భారత్ రష్యా దగ్గర చమురు కొనుగోళ్లు నిలిపి వేస్తే కానీ సుంకాల దండన తొలగించలేదు. అయితే గల్ఫ్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్ధితుల క్రమంలో ముడి చమురు రవాణా తగ్గిపోయి అన్ని దేశాలలో.. అమెరికాతో సహా.. పెట్రోల్ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. అయితే వీటిని కట్టడి చేసేందుకు భారత్ ప్రయత్నాలను అమెరికా రాయబారి సెర్గియా గోర్ ప్రశంసించారు. ప్రస్తుతం తమ మిత్ర దేశం భారత్ పాత్ర కీలకంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చమురు వినియోగదారు, ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటి ఉందని. అమెరికా మద్దతు తో రష్యా దగ్గర నెల రోజులు పాటు భారీ స్థాయిలో భారత్ చమురు కొనుగోలు చేసి దానిని త్వరితంగా శుద్ధి చేసి ప్రపంచ దేశాలతో అందిస్తుందని దీనికి అమెరికా మద్దతుగా ఉంటుందని ప్రకటన జారీ చేశారు. భారత్ కు స్వల్ప కాలం మాత్రమే పర్మిషన్ ఇచ్చినప్పటికీ.. దీని వల్ల రష్యాకు కూడా ఆర్ధిక ప్రయోజనం కలుగుతుందన్నారు. అంతర్జాతీయ రవాణా షిప్ లను నిలిపివేస్తూ హార్ముజ్ జలసంధి ద్వారా ఇంధన సరఫరాను నిరోధించడంలో ఇరాన్ చేసే చర్యను అడ్డుకునేందుకు నేడు బుధవారం ఉదయం అక్కడి ఇరాన్ జవాన్ల ఫై అమెరికా దాడులు చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *