సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని మాత్రం లాభాలతో ప్రారంభించాయి. గత వారం వరుస నష్టాలతో 80 వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్ నేడు, సోమవారం మళ్లీ కోలుకుంది. ప్రధాని మోడీ జపాన్ తో చేసుకొన్నా ఒప్పందాలు మరియు తాజా చైనా పర్యటనతో చేసుకొన్నా ఒప్పందాలుతో మార్కెట్ పాజిటివ్ గా లాభాలతో మొదలు అయ్యింది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ మళ్లీ 80 వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 391 పాయింట్ల లాభంతో 80, 201 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 124 పాయింట్ల లాభంతో 24, 551 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 749 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 312 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 88.23గా ఉంది
