సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో రికార్డు స్థాయి గరిష్టాలకు చేరుకున్న బంగారం ప్రస్తుతం క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్‌టైమ్ హై కి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు, శుక్రవారం (నవంబర్ 29న) ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 190 తగ్గి రూ. రూ. 77, 490కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 180 రూపాయలు తగ్గి రూ. 77,340కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 70,890కి చేరింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77, 490కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 71,040 స్థాయికి చేరింది. కానీ వెండి రేట్లు మాత్రం ఈరోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో, విజయవాడ లలో వెండి కేజీ ధర రూ. 97,900 కు లభిస్తుంది.
