సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపోరేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 6.25 నుంచి 6 శాతానికి రెపోరేటుతగ్గించేసింది. ఆర్బీఐ వరుసగా రెండోసారి రెపోరేటు తగ్గించటం విశేషం. ఆర్బీఐ నిర్ణయంతో దీనితో ఫిక్సయిడ్ డిపాజిట్ లపై వడ్డీ తగ్గటంతో పాటు, గృహ, పర్సనల్, వాహనాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి వడ్డీ రేట్లు తగ్గించటంపై నేడు, బుధవారం ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ.. ‘ రెపో రేటు తగ్గిస్తూ మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం రెపో రేటును తగ్గించటం ఇది రెండో సారి. ఇటీవల ప్రపంచ స్థాయిలో ఆర్థిక పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకొంది అన్నారు. దిగుమతుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై అత్యధిక స్థాయిలో టారిఫ్ విధించారు అని అన్నారు.
