సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా .. అమెరికాలో జరుగుతున్నా ఆస్కార్‌(Oscar 2024) వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం సన్నివేశాలు ఆహుతుల కళతారా ధ్వనుల మధ్య మరోసారి మెరిసాయి. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా జరిగిన వేడుకలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హ్యాష్‌ట్యాగ్‌ ఎక్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. గత సంవత్సరం బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘నాటునాటు’ పాట ఆస్కార్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే! నేడు జరిగిన వేడుకలలో . ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో అవార్డును ప్రకటించే క్రమంలో మరోసారి ఆస్కార్ తెరపై ‘నాటునాటు’ తెలుగు పాటను ప్రదర్శించారు. అంతేకాదు ఇప్పటి వరకు సినిమాల్లో వచ్చిన బెస్ట్‌ యాక్షన్ కు సంబంధించిన ప్రత్యేక ఏవీని వేదికపై ప్రదర్శించారు. అందులోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని రెండు యాక్షన్‌ షాట్స్‌ను చూపించడం విశేషం. ఈ ఏడాది బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ అవార్డు ‘బార్బీ’ చిత్రంలోని ‘వాట్‌ వాస్‌ ఐ మేడ్‌ ఫర్‌’ అనే పాటకు వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *