సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు గత సోమవారం ముగిశాయి. ఓటరు మహాశయుల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే గెలుపుపై అటు అధికార వైసీపీ ఎక్కువ ధీమా తో ఉండగా ఇటు కూటమి పార్టీలు కూడా ఎవరి లెక్కలు వారు చూపిస్తూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఏపీ తెలంగాణ భవన్‌లో తెలంగాణ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలలో జగన్ గెలుస్తున్నాడని తమ వద్ద ఆ సమాచారం ఉందని పెరిగిన ఓటింగ్ శాతం వైసీపీ కే అనుకూలం అని భావిస్తున్నానని అన్నారు.
