సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ రోజు గురువారం 2 కీలక కేసులలో బెయిల్ రావడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదల కావాల్సిన వైసీపీ సీనియర్ నేత, అంబటి రాంబాబుఫై మరో కేసు లో కోర్టు మరోసారి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు గుంటూరు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండగ వేళ.. లక్కీడిప్ నడిపారని మరో ఆరోపణపై సత్తెనపల్లిలో నమోదు అయిన కేసులో అంబటి రాంబాబుకు న్యాయమూర్తి ఈ రిమాండ్ విధించారు. దాంతో గుంటూరు నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు అంబటి ని భారీ బందోబస్తు నడుమ తరలించారు. తనను ఇప్పట్లో వదలరు అని ముందే ప్రిపేర్ అయినట్లు అంబటి తనను చూడటానికి వచ్చిన వందలాది అభిమానులకు పోలీస్ వ్యాను నుండే పుష్ప తరహాలో ‘తగ్గేదే లే.’. అన్నట్లు సంకేతం ఇచ్చి జోషే పెంచడం మీడియా ఛానెల్స్ లో హాల్ చల్ చేస్తుంది.
