సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చైనా, జపాన్, అమెరికా సహా పలు దేశాల్లో కొవిడ్ విజృంభిస్తోన్న నేపథ్యం లో.. భారత్ లో కరోనా మరోసారి అలజడి సృష్టితుందా ? అన్న ప్రశ్నకు భారత వైద్య సంస్థ , ఐఎంఏకు చెందిన డా.అనిల్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. అటువంటి పరిస్థితి ఇండియాలో రాదని ఎందుకంటే.. దేశంలో 95 శాతం మందికి ఇప్పటికే సమర్ధవంతమైన కొవిడ్ టీకా పూర్తయిన నేపథ్యంలో.. ఇప్పటికే భారత్ 200 కోట్లకుపైగా డోసులు అందించింది. ఈ నేపథ్యంలో దేశంలో మరోసారి లాక్ డౌన్ విధించే పరిస్థితి రాదని భరోసా ఇచ్చారు. నిజానికి చైనా ప్రజలకంటే భారతీయుల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉందని చెప్పారు..ప్రస్తుత పరిస్థితుల్లో.. అయితే భారత్ తప్పనిసరిగా మళ్లీ . బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ల వినియోగం తో పాటు టెస్టింగ్, ట్రీటింగ్, ట్రేసింగ్’ విధానానికి మారాలని డా.గోయల్ సూచించారు.
