సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మీదుగా బెంగుళూర్ వైపు వెళ్లటానికి ప్రయాణికుల రద్దీ మేరకు నరసాపురం – యశ్వంత్‌పూర్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేక రైళ్లు ప్రతి మంగళ, బుధవారాల్లో మూడు నెలలపాటు రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 07151 నెంబర్‌తో నరసాపురం నుంచి జూలై 13, 18, 25, ఆగస్టు 1, 8, 15, 22, 29, సెప్టెంబరు 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు యశ్వంత్‌పూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07152 నెంబర్‌తో ఈ నెల 12, 19, 26, ఆగస్టు 2, 9, 16, 23, 30, సెప్టెంబరు 6, 13, 20, 27 తేదీల్లో యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయలు దేరి మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు నరసాపురం చేరుతుంది. ఏపీలోని పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, గుంటూరు, నంద్యాల, ధర్మవరం, హిందూపురం స్టేషన్ ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.
