సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు కు ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసు కు హైదరాబాద్ లో మరోసారి నటి బోయ సునీత నుండి ఊహించని షాక్ తగిలింది. గత గురువారం రాత్రి బన్నీ వాసు ఉండే.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-45లోని గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ఎదుట దుస్తులు విప్పి అర్ధనగ్నంగా ఆందోళన చేపట్టడం తో స్థానికులు ఇబ్బందికి గురయ్యారు. సినీ నిర్మాత బన్నీ వాసు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తూ గతంలో ఆమె పలుమార్లు (గతంలో శ్రీ రెడ్డి తరహాలో) నిరసన వ్యక్తం చేసి హల్‌చల్‌ చేశారు. నెల రోజుల క్రితం కూడా గీతా ఆర్ట్స్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేసేందుకు వచ్చిన సునీతను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె మతిస్థిమితం సరిగా లేదని భావించి గతంలో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. అయితే రాత్రి మరోసారి గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ఎదుట కూర్చొని, న్యాయం చేయాలని రచ్చ చెయ్యడంతో . సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *