సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా బంగారం,వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నేటి ఉదయం (నవంబర్ 29) భారత్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,470గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.730 మేర పెరిగింది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.760 మేర పెరిగి 1,17,760కు చేరుకుంది. ఇదిలా ఉండగా ఒక కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,76,100గా ఉంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై స్పష్టత వచ్చే వరకూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు తప్పవనేది మార్కెట్ నిపుణుల అంచనా. ఇటీవల పారిశ్రామిక రంగాలలో వెండి వినియోగం బాగా పెరిగిపోవడంతో డిమాండ్ కు తగ్గ వెండి మార్కెట్ లో లేక ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.
