సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వయస్సు 74కు చేరిన ఫిట్నెస్ లోకాని మళయా ‘సూపర్ స్టార్’ ఇమేజ్ లోకాని ఎటువంటి మార్పు లేని మమ్ముటి ఇటీవల కాలం కావ‌ల్‘ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఆయన తెలుగులోనూ ఎన్నో చిత్రాలలో నటించిన యాత్ర.. యాత్ర 2 లకు ప్రత్యేక స్తానం ఉంది. ముమ్మూర్తులా స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి ఆవహించినట్లు నటించి శబాష్ అనిపించుకొన్నారు. గంబీరమైన రాజశేఖర్ వాయస్ ను మాండలికం ను కూడా తెలుగు లో స్వయంగా డబ్బింగ్ లో ఆయన అనుకరించారు. అయితే తాజగా ఆయన మలయాళం లో నటించనున్న పాదయాత్ర సినిమా సంచలనమ్ రేపుతోంది. మళయాళ లెజెండరీ డైరెక్ట‌ర్ ఆదుర్ గోపాల కృష్ణన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను హీరో మమ్ముట్టి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా విడుద‌ల చేశారు. ఇది తెలుగు నాట రాజకీయాలకు సంబందించిన చిత్రంగా ప్రచారంలో ఉంది. బహుశా యాత్ర 3 అని కూడా భావిస్తున్నారు. ఇది కచ్చితంగా తెలుగులో డబ్బింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమా రిలిజ్ అయితే కానీ పాదయాత్ర ఉద్దేశ్యం అర్ధం కాదు. ఇది. స్వ‌యంగా మ‌మ్ముట్టి ఈ సినిమాను నిర్మిస్తుండటం మరో విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *