సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కరోనా మహమ్మారి పేరు చెపితే వణుకు పుడుతుంది. ఇప్పటికే గత అనుభవాల దృష్ట్యా భారీ జన నష్టంతో ప్రపంచవ్యాప్తంగా రెండు, మూడుసార్లు లాక్‌డౌన్స్ నిర్వహించిన తర్వాత.. కరోనా ప్రభావమైతే ఇటీవల గణనీయంగానే తగ్గింది. ఇంకా చైనా మరికొన్ని కొన్ని దేశాల్లో వివిధ వేరియెంట్లు పంజా విసిరినా, కొవిడ్ కేసులు నమోదైనా.. మునుపటిలా ఎక్కువ స్థాయిలో నమోదవ్వలేదు. క్రమంగా దాని ప్రభావం తగ్గుతూ వచ్చింది. అయితే కొద్దీ రోజులుగా సింగపూర్‌లో కరోనా మరోసారి విజృంభించింది. తక్కువ జనాభా ఉన్న సింగపూర్లో కేవలం వారం రోజుల్లోనే (మే 5 నుంచి 11వ తేదీ వరకు) అక్కడ 25,900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో.. అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సింగపూర్ ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ మాట్లాడుతూ.. ‘‘కొత్తగా కొవిడ్ ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. నాలుగు వారాల్లో ఇది గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉంది’’ అని తెలిపారు.దీనితో సింగపూర్ వెళ్లేవారు అక్కడి నుండి వచ్చే వారితో అప్రమత్తంగా ఉండాలని మన భారత్ అలర్ట్ చెయ్యవలసి ఉంది.. ఎన్నికల నేపథ్యంలో పట్టించుకోలేదా ?
