సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దిల్ రాజు నిర్మాతగా , అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ( ఎఫ్ 4 సిరీస్ కాదు .. అది ప్రక్కన పెట్టేసారు) నిర్మిస్తున్న సినిమా అతి త్వరలో షూటింగ్ ప్రారంభిస్తున్నారు. దీనిలో వెంకీ సరసన త్రిషా హీరోయిన్ గా ఉంటుందని మరో హీరోయిన్ కూడా ఉంటుందని ఫిలిం వర్గాల వార్త! పూర్తీ గ్రామీణ వాతావరణంలో కధ నడిచే ఈ సినిమాను శరవేగంగా పూర్తీ చేసి దసరా లేదా సంక్రాంతి కి విడుదలకు సిద్ధం చెయ్యాలని దిల్ రాజు ప్లాన్.. టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్‌, త్రిషలది ( తెలుగునాట సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘నమో వేంకటేశా’, ‘బాడీగార్డ్‌’ చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్స్ కొట్టారు. ప్రస్తుతం ఈ జోడీ మరోసారి రిపీట్ కాబోతుంది. అలాగే దిల్ రాజు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన 4 సినిమాలు కూడా ఘన విజయాలు సాధించాయి. సీతమ్మ వాకిట్లో.. ఎఫ్ 2 , ఎఫ్ 3 , ఓరిదేముడా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *