సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో జైలు లో ఉన్న చంద్రబాబు తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబుకి అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. దానితో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు.. సుప్రీం లో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దానిపై విచారణ వాయిదాలు పడినప్పటికీ ఎట్టకేలకు ఈ పిటిషన్ నేడు, మంగళవారం జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం వాదనలు విన్నారు. తదుపరి విచారణ ను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. క్యాష్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు కు సమర్పించిన అన్ని ఆధారాలు ఇక్కడ ఉండాలని ఆదేశించింది. దీనితో చంద్రబాబు తో పాటు టీడీపీ శ్రేణులకు మరోసారి నిరాశ ఎదురయ్యింది, చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ల్ సాల్వే , అభిషేక మను సింఘ్వీ వాదనలు వినిపించారు.‘చంద్రబాబు కేసు పూర్తి రాజకీయపరమైంది. 17ఏ.. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేసారు. 73 ఏళ్ల మాజీ ముఖ్య మంత్రిని వేధిస్తున్నారు. అని వాదించగా ఇక ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 17ఏతో ఈకేసుకు ఎలాంటి సంబంధం లేదు. జులై 2018లో 17-A వచ్చింది. అంతకంటే ముందే ఈ కేసు విచారణ ప్రారంభమైంది ఇందులో రాజకీయ కక్ష లేదు. తప్పు చేసింది 2015-16లో దర్యాప్తు మొదలయింది గత సీఎంగా గా చంద్రబాబు APSDCని ప్రారంభించారు. ఇందులో స్కాం జరిగింది అని స్వష్టమైన ఆధారాలు ఉన్నాయి, అరెస్టయిన మూడు రోజుల్లోనే బెయిల్ కోరకుండా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అందుకే చంద్రబాబు పిటిషన్ ను తిరస్కరించాలి అని ముకుల్ రోహత్గివాదనలు వినిపించారు.
