సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నైరుతి రుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్ లో ముందుగానే అడుగుపెట్టి ఈ వారంలో రాష్ట్రము అంతటా విస్తరిస్తున్నాయి. మరో ప్రక్క నేటి మంగళవారం ( మే 27న) ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో 29వ తేదీలోగా అల్పపీడనం వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో మే చివరి వారంలో దక్షిణ భారత దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్పపీడన ప్రభావం ప్రభావంతో (మే 27, 28, 29 తేదీల్లో)నేటి నుండి వరుసగా 3 రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావారణ శాఖ తెలిపింది.
