సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో వర్షాలతో పాటు ఎండలు కూడా ప్రచండంగా చెలరేగిపోతున్నాయి. వాతావరణం విచిత్రంగా ఉంటుంది. గోదావరి , కృష్ణ నదులకు ఫై నుండి వచ్చే నీరు తగ్గడంతో వరద ఉదృతి తగ్గింది. అయితే రాష్ట్రానికి రేపటి నుండి (ఆగస్టు నెల 25) కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశంఅల్పపీడనం అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి, పైకి వెళ్ళేకొద్దీ నైరుతి దిశగా వంగి కనిపిస్తోంది. దీనితో పాటు రాష్ట్రం మొత్తం మీద నైరుతి–పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు గోదావరి జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *