సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వాతావరణ శాఖ సూచనల ప్రకారం రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత, మరింత బలపడి బాగా గుర్తించబడిన అల్పపీడనంగా మారి, తదుపరి రెండు రోజుల్లో అంటే ఎల్లుండి మంగళవారం నుండి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో నేడు, వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. రేపటి నుండి అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు, ఎల్లుండి మంగళవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
