సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 5 రోజులుగా ఏకబిగా కురిసిన భారీ వర్షాలకు గోదావరి జిల్లాల ప్రజలు కుదేలు అయ్యారు. అయితే నేడు, గురువారం కాస్త ఎండా కాసింది. అయితే వరద ముంపు పొంచి ఉంది. రైతుల పంట పొలాల నుండి నీరు వెళ్లకముందే ఏపీలో, తెలంగాణలో రాబోయే 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు కాగా, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంత్త రాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నాలుగు రోజులు పాటు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటలకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.
